పెద్ద తడుగూర్ పంచాయితీ పనుల్లో లోపాలపై ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు వినతి


నవతెలంగాణ మద్నూర్: మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామపంచాయతీ పనుల్లో లోపాలు జరిగినట్లు అలాంటి వాటి పట్ల చర్యలు చేపట్టాలని గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ చూపాలని ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ రాజు, నాయకులు ఈరన్న యువ నాయకులు కలిసి హైదరాబాదులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ అభివృద్ధిలో లోపాలు జరిగినట్లు అభివృద్ధి పనుల్లో గాని పెండింగ్ పనుల్లో గాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాటి పట్ల చర్యలు తీసుకోవాలని గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. జిపి పనుల్లో లోపాల గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే నాయకులకు హామీ ఇచ్చినట్లు హైదరాబాద్ కు తరలి వెళ్లిన నాయకులు కొండ రాజు, ఈరన్న, యువ నాయకులు ఫోన్ ద్వారా మండల విలేకరులకు తెలిపారు.

Spread the love