పెట్రోల్ ధరలు పెంపు..

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.02 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజా పెంపుతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కి చేరగా డీజిల్ రేట్ రూ.88.94గా ఉంది. కాగా రాష్ట్రంలో 2021 నవంబర్‌లో చివరిసారి ఇంధన ధరలను సవరించారు.

Spread the love