నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

నవతెలంగాణ – అమరావతి
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దంపతులపై దుండగులు పెట్రోల్‌పోసి నిప్పంటించారు. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు నల్లపురెడ్డి, కృష్ణవేణి ఆరుబయట నిద్రిస్తుండగా పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు సమీపంలో నిద్రిస్తున్న పూజిత అనే బాలికకూ మంటలు అంటుకున్నాయి. ముగ్గురికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.

Spread the love