24K డిజిటల్ గోల్ట్ కోనుగొలుపై PhonePe క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

– తేరస్, దీపావళి సీజన్
–  నేటి  నుండి 12వరకు 24K బంగారం కొనుగోలుపై 3000 రూపాయల వరకు గ్యారంటీ క్యాష్ బ్యాక్
నవతెలంగాణ హైదరాబాద్: దంతేరస్ (ధన త్రయోదశి), దీపావళి 2023 పండుగ సీజన్‌‌ను పురస్కరించుకుని, 24K బంగారంపై ఉత్సాహపూరిత క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు PhonePe నేడు ప్రకటించింది. PhonePe నుండి కనీసం రూ. 1000 విలువ కలిగిన డిజిటల్ బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు, రూ.3000 వరకు గ్యారంటీ క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ నేటి నుండి 12వ తేది వరకు మాత్రమే.  వన్-టైమ్ లావాదేవీలన్నిటికీ (ఒక వినియోగదారుకు ఒకసారి) చెల్లుతుంది. భారతదేశంలోని 19,000+ పోస్టల్ కోడ్లలో నివసిస్తున్న 1 కోటికి పైగా కస్టమర్లు PhonePe వేదికలో అత్యంత స్వచ్ఛమైన 24K బంగారాన్ని పారదర్శకమైన ధరల్లో కొనుగోలు చేశారు. PhonePe ప్రముఖమైన డిజిటల్ పేమెంట్ల వేదికగా ఉండడమే కాక ప్రముఖమైన, అత్యంత విశ్వసనీయమైన భాగస్వాముల నుండి 99.99% స్వచ్ఛమైనదిగా ధృవీకరించిన 24K డిజిటల్ బంగారాన్ని అందిస్తుండడమే దీనికి కారణం.
ఈ ధృవీకరించిన 24K బంగారాన్ని కస్టమర్లు డిజిటల్ రూపంలో తయారీ ఖర్చులు ఏవీ లేకుండానే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఉచిత స్టోరేజ్ కోసం ఇన్సూరెన్స్ సౌకర్యంతో బ్యాంక్ గ్రేడ్ లాకర్లను ఉపయోగించుకోవచ్చు. ఇవి కాకుండా PhonePeలో డిజిటల్ బంగారం కొనుగోలు చేయడం కోసం 24*7 షాపింగ్ చేసుకునే సౌకర్యం లాంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కస్టమర్లు ఏ సమయంలో అయినా తాము నిల్వ చేసుకున్న బంగారాన్ని విక్రయించుకోవచ్చు. ఆ విక్రయం ద్వారా అందే సొమ్ము 48 గంటల్లో వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడుతుంది. కస్టమర్లు తాము కోరుకున్న ఎంత మొత్తానికి అయినా డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టే సౌలభ్యం కూడా ఉంది. ఒకసారి కొనుగోలు చేసే సౌకర్యం మాత్రమే కాకుండా, క్రమబద్ధంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంలో సహాయ పడే రీతిలో SIP పద్ధతిలో డిజిటల్ బంగారంలో మదుపు చేసే అధికారాన్ని కూడా PhonePe కల్పిస్తోంది.

*ఈ ఆఫర్ నవంబర్ 9-12, 2003 మధ్య కనీసం 1000 రూపాయల విలువ కలిగిన డిజిటల్ బంగారం కొనుగోలు చేసే సమయంలో PhonePeలో చేసే అన్ని వన్-టైమ్ లావాదేవీలకూ (ఒక వినియోగదారుకు ఒకసారి) చెల్లుతుంది.

*బ్యాంక్ గ్రేడ్ లాకర్లు ఐదేళ్ల వరకు ఉచితంగా లభిస్తాయి. PhonePeలో బంగారం కొనేటప్పుడు ఈ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుకునేందుకు దశల వారీ మార్గదర్శి మీకోసం కింద ఇవ్వబడింది:

1వ దశ: మీ PhonePe యాప్ హోమ్ పేజీలోని కింది పట్టీలో ఉన్న ‘సంపద’ను క్లిక్ చేయండి.
2వ దశ: సంపద స్క్రీన్ పైన ‘బంగారం’ను ఎంచుకోండి.
3వ దశ: “ఒకేసారి కొనండి”ని ఎంచుకోండి.
4వ దశ: “రూపాయిల్లో కొనండి”ని ఎంచుకోవడం ద్వారా కొనసాగించి, కనీసం 1000 రూపాయల విలువ కలిగిన 24K బంగారాన్ని చేర్చండి.
5వ దశ: మీ బంగారం కొనుగోలు తుది వివరాలను చెక్ చేసి, ‘పే చేసేందుకు ముందుకెళ్లండి’పై క్లిక్ చేయండి.
అంతే, మీ పని పూర్తయినట్టే! PhonePe గ్రూప్ పరిచయం: PhonePe భారతదేశంలోని 99%కు పైగా పోస్టల్ కోడ్లలో నివసిస్తున్న 49 కోట్లకు పైగా (490 మిలియన్లకు పైగా) రిజిస్టర్డ్ యూజర్లు, 3.6 కోట్లకు పైగా (36 మిలియన్లకు పైగా) మర్చంట్లకు సేవలు అందిస్తూ, భారతదేశపు అగ్రశ్రేణి డిజిటల్ పేమెంట్ కంపెనీగా విలసిల్లుతోంది. డిజిటల్ పేమెంట్లలో తాను దక్కించుకున్న అగ్రస్థానం బలాన్ని ఆసరాగా చేసుకుని, PhonePe ఆర్థిక సేవల రంగం (ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్, లెండింగ్)లోకి ప్రవేశించడంతో పాటు, తన సాంకేతిక సౌలభ్యంతో హైపర్ లోకల్ షాపింగ్ కోసం పిన్‌కోడ్, భారతదేశపు మొదటి స్థానిక యాప్ స్టోర్ ఇండస్ యాప్ స్టోర్ లాంటి వ్యాపారాలలోకి కూడా విస్తరించింది.
PhonePe గ్రూప్‌ను నగదు చెలామణికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించి, సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తమ ప్రాసెస్‌ను వేగవంతం చేసుకోవడానికి ప్రతి భారతీయుడికి సమాన అవకాశం కల్పించాలనే విశాల దృష్టితో అనుసంధానించిన వ్యాపారాల పోర్ట్ ఫోలియో అని చెప్పవచ్చు. మరిన్ని వివరాల కోసం: [email protected]

Spread the love