కేదార్‌నాథ్‌ ఆలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం

నవతెలంగాణ – దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆలయంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. ‘‘కేదార్‌నాథ్‌ ఆలయంలోకి భక్తులు మొబైల్‌ ఫోన్లు తీసుకురావొద్దు. ఆలయం లోపల ఫొటోలు, వీడియోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఆలయంలో సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆలయ కమిటీ తెలిపింది. గతంలో ఆలయ పరిసరాల్లో కొంతమంది భక్తులు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది.

Spread the love