ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోలు..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ కేబినెట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఆయన ఆదేశంతో వెంటనే పలు కార్యాలయాల్లో ఇద్దరి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Spread the love