
పనివిధానంలో పడి ఆట,పాటలకు దూరం అయిన పరిస్థితుల బయటపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.ఆటలతో శారీరక,మానసిక పునరుత్తేజానికి వీలు కలిగి శరీరదృఢత్వం చేకూరుతుందని ఆమె తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ దినోత్సవాలలో భాగంగా న్యాయవాదులు,న్యాయమూర్తుల క్రీడాక్రార్యక్రమాలను నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో శనివారం మొదటి రోజు న న్యాయవాదుల క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి వ్యక్తి ఏదొఒక పనిచేసి అలసిపోతాడని క్రీడలతో అలసటను,శారీరక శ్రమను మరిచి నూతనోత్తేజాన్ని చేకూర్చు కుంటాడని ఆమె పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు వారివారి వృత్తులలో ఎంతో ఒత్తిడికి లోనవుతారని, ఆటలతో అవన్నీ దూరం అవుతాయని అన్నారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల క్రీడలను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే వెలుసుబాటు క్రీడాపోటీలతో బయటపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ఆటలాడితే వచ్చేది వెల కట్టలేని ఆనందమేనని అన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జి హరి కుమార్, బార్ ఉపాధ్యక్షుడు రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పల్,క్రీడల కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, కోశాధికారి దీపక్ ,న్యాయవాదులు మానిక్ రాజు,కవిత రెడ్డి,ఎర్రం విగ్నేష్,రణదీశ్,రవి ప్రసాద్, తుకారాం,తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ పోటీలలో విజేత ప్రెసిడెంట్ లెవెన్..
మొత్తం నాలుగు జట్లు పాల్గొనగా ఎ టీం మొత్తం పదిహేను ఓవర్లకు 133 పరుగులు చేశారు. తరువాత బ్యాటింగ్ చేసిన బి టీం 14ఓవర్లలోనే 134 పరుగులు చేసి విజయం సాధించింది. సి టీం మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది.తరువాత బ్యాటింగ్ చేసిన డి టీం 151 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలయ్యారు. ఫైనల్ కు చేరిన ఎ టీం, సి టీం చేరుకొన్నాయి.జగన్ మోహన్ గౌడ్ నాయకత్వంలోని ఎ టీం మొత్తం15 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.తరువాత బ్యాటింగ్ దిగిన తులసి దాస్ కెప్టెన్సీ లోని సి టీం 15 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 183 పరుగులు మాత్రమే చేసి ఎ టీం చేతిలో ఓటమిపాలుఅయింది.