వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ పరీక్షలు

నవతెలంగాణ-నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బుదవారం దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజియోథెరపీ శిబిరంలో నసురుల్లాబాద్ మండల పరిధిలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ డాక్టర్ మనీషా చికిత్స చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ శిబిరంను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇప్పటికీ శిబిరంకు రానివారు ఫిజియోథెరపీ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమాన్లు, శిబిరం నిర్వాహకుల సిబ్బంది, సురేష్, రూప, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love