నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళ వారం దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజియోథెరపీ శిబిరంలో నసురుల్లాబాద్ మండల పరిధిలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ డాక్టర్ మనీషా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనీషా మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ శిబిరంను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇప్పటికీ శిబిరంకు రానివారు ఫిజియోథెరపీ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 2 సంవత్సరాల చంటి పిల్లల నుండి 14 ఏండ్ల వయస్సు గల పిల్లలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హాన్మండ్లు, శిబిరం నిర్వాహకుల సిబ్బంది, సురేష్, రూప, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.