ఇఫ్తార్ విందులో జేబుదొంగ

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని శివరాంపల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, రంజిత్ రెడ్డి, అనిల్ యాదవ్, దానం నాగేందర్, ఫిరోజ్ ఖాన్ సహా పలువురు వీఐపీలు హాజరయ్యారు. ఈ విందులో వీఐపీలతో పాటు స్టేజీ ఎక్కిన ఓ గజదొంగ తన నైపుణ్యం ప్రదర్శించాడు. హడావిడిలో ఉన్న వీఐపీల జేబులకు కన్నం వేశాడు, ఈ చోరీలో 8 ఫోన్లతో పాటు దాదాపు 2 లక్షల నగదు కొట్టేశాడు. ఎవరు లేని సమయం చూసి జారుకుంటుండగా.. అనుమానం వచ్చిన కార్యకర్తలు ఆరా తీసి పట్టుకున్నారు. అసలు విషయం బయటపడటంతో పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. గజదొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Spread the love