ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు

విరిగిపడ్డ కొండచరియలు.. స్తంభించిన రాకపోకలు..
విరిగిపడ్డ కొండచరియలు.. స్తంభించిన రాకపోకలు..

నవతెలంగాణ డెహ్రాడూన్‌: గతరెండు రోజులుగా విడవకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం అవుతోంది. దీనితో అనేక మంది యాత్రికుల అక్కడ చిక్కుకుపోయారు. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. రుషికేశ్‌కు 40కి.మీ దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, 20వేల మంది స్థానికులు, యాత్రికులు రోడ్డుపైనే 20 గంటలుగా పడిగాపులు పడుతున్నారు. త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా అందులో ఉన్నారు. వారంతా తిరుగుప్రయాణంలో చిక్కుకున్నారు.

Spread the love