భారీ గాలి వానకు విరిగిన స్తంభాలు

భారీ గాలి వానకు విరిగిన స్తంభాలు– నిలిచిపోయిన విద్యుత్‌, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు
నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రంలో భారీగా కురుస్తున్న వర్షానికి ఆదివారం రాత్రి మండల కేంద్రానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుదాస్‌ వాటిక ఆశ్రమంలో భారీ వక్షాలు విరిగిపడి విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో రాత్రి 12 గంటల నుంచి మండలం, పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను గుర్తించిన విద్యుత్‌ శాఖ అధికారులు సిబ్బంది డీఈ సంజీవ్‌ ఆధ్వర్యంలో లైన్‌మెన్‌ రుక్మయ్య లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్‌ కృష్ణ సిబ్బందితో కలిసి భారీ వృక్షాలను తొలగించి కొత్తగా రెండు స్తంభాలు వేసి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సమస్యను పరిష్కరించారు. విద్యుత్‌ సమస్య రావడంతో తహసీల్దార్‌ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లు, బ్యాంకు లావాదేవీలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సమస్యలు లేకుండా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love