వాణిజ్య గ్యాస్‌పై బాదుడు

– రెండు నెలలు తగ్గించి.. ఇపుడు రూ.7 పెంపు
– హైదరాబాద్‌లో ప్రస్తుత ధర..రూ.2325
వాణిజ్య గ్యాస్‌పై బాదుడు
న్యూఢిల్లీ : వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెంచింది. సిలిండర్‌కు రూ.7 పెంచినట్టు ప్రభుత్వ రంగ మార్కెటింగ్‌ సంస్థలు మంగళవారం తెలిపాయి. పెరిగిన ధరతో న్యూఢిల్లీలో ఒక 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1,780కు చేరుకుంది. చెన్నైలో రూ. 1,952కు చేరుకుంది. వాణిజ్య గ్యాస్‌ ధరలను మే, జూన్‌లో తగ్గించిన ప్రభుత్వం జులైలో మళ్లీ పెంచింది. వాణిజ్య, గృహ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలను ప్రతీ నెల 1వ తేదీన మార్కెటింగ్‌ సంస్థలు సమీక్షిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. కాగా పెరిగిన ధరలతో హౌటళ్లు, ఇతర విక్రయాలపై మరింత భారంపడనున్నది.

Spread the love