పొలండ్‌లో కూలిన విమానం.. ఐదుగురు మృతి

నవతెలంగాణ – పొలండ్‌: పొలండ్‌ రాజధాని వార్సాకు సమీపంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. దీంతో పైలట్‌ సహా ఐదుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వార్సా నుంచి 47 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్‌ఫీల్డ్‌ వద్ద విమానాలు నిలిపి ఉంచే హ్యాంగర్‌ఫై సెస్నా 208  అనే చిన్న విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో హాంగర్‌లో ఉన్న నలుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఆడమ్‌ నిడ్జిల్క్సి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం కూలినట్లు తెలుస్తున్నది. సహాయచర్యల కోసం ప్రమాద స్థలానికి నాలుగు హెలికాప్టర్లు, 10 అంబులెన్సులను పంపించామని అధికారులు తెలిపారు.

Spread the love