మేడారం అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు

Planned measures for the development of Medaram– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
– పారిశుద్ధ్య నిర్వహణను ప్రణాళిక ప్రకారం మెరుగుపర్చాలి
– భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
– మేడారంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం 
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. గురువారం  జిల్లా కలెక్టర్ దివాకర  టి. ఎస్. మేడారంలోని ఐటిడిఏ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల దేవాలయం అభివృద్ధి, పారిశుద్ధ్యంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం గ్రామంలో,  శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం ప్రాంగణం లో  చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలు, వాటి స్థితిగతులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   ప్రభుత్వ సెలవు రోజుల్లో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య  పెరుగుతుందని అన్నారు.  ఆలయ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం ప్రాంగణం, క్యూ లైన్లు, మంచే, పరిసరాలు పరిశీలించారు. చిలుకలగుట్ట, జంపన్నవాగు, మ్యూజియం, కొంగలమడుగు, రెడ్డిగూడెం లను కలెక్టర్ సందర్శించి రెడ్డి గూడెం వద్దనున్న 28 ఎకరాల  ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ కే సత్యాపాల్ రెడ్డి, మేడారం దేవాలయం ఈ ఓ రాజేందర్, ఆర్ అండ్ బి, పి ఆర్, ఆర్ డబ్లు ఎస్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక తహశీల్దారు తోట రవీందర్, ఎంపిడిఓ సుమన వాణి, ఎంపిఓ శ్రీధర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love