పంటలకు సస్య రక్షణ చర్యలు చేపట్టాలి

– పంటలను పరిశీలించిన డీఏవో శ్రీధర్
నవతెలంగాణ-వీణవంక :
చీడ, పీడల నుండి పంటల రక్షణకు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద సూచనలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని వరి, పత్తి పంటలను ఆయన మంగళవారం స్థానిక ఏఈవో చందా రాకేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  పంటలకు వస్తున్న సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే నష్టాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా వరిలో వచ్చే మొగిపురుగు, అగ్గి తెగులు, జింకు లోపం వల్ల మొక్కకు కలిగే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి కావాల్సిన  సస్యరక్షణ చర్యలు చేపట్టే విధానంపై రైతులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ కట్ట కుమారస్వామి, రైతులు ఇట్టవేన రాజయ్య, కొమిరె రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love