చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత 

Planting trees is everyone's responsibility– మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ –  కామారెడ్డి
చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నేడు పర్యావరణ మొత్తం కాలుష్యంతో నిండిపోతుందని అందువల్ల మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్లు నాటడంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఎందుకు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో గాల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, తమకు ఎలా పట్టాలు రాలేదని చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆమె మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ల వద్ద నీటి సమస్యను తీర్చడానికి బోర్ బండిని తెప్పించి కొబ్బరి కొట్టి బోర్ వేయించరు. అనంతరం ఆమె డబల్ బెడ్ రూమ్ లో ఆవరణంలో మొక్కను నాటారు. మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారిమౌతామన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలన్నారు. త్వరలోనే పై అధికారులతో చర్చించి ఇండ్ల పట్టాలు వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, పాత శివ కృష్ణమూర్తి, పంపరి లతా శ్రీనివాస్, వనిత రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ జూలూరు సుధాకర్,  కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love