మొక్కలను నాటి సంరక్షించాలి 

-హుస్నాబాద్ ఏసిపి సతీష్ 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలని హుస్నాబాద్ ఏసిపి సతీష్ అన్నారు. సోమవారం  తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి సతీష్  మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్  సీఐ ఎర్రల కిరణ్, ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love