జూన్ మొదటి వారం లోపు నర్సరీలలో మొక్కలు సిద్ధం కావాలి: చందర్ నాయక్

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

జూన్ మొదటి వారం లోపు నర్సరీలలో మొక్కలు అన్నీ సిద్ధం కావాలని డి ఆర్ డి ఓ చందర్ నాయక్ అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని వదలపర్తి మాల్ తుమ్మెద గ్రామాలలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను మరియు నర్సరీలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జూన్ మొదటి వారం వరకు నర్సరీలలో పెరిగే మొక్కలన్ని సిద్ధం కావాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పదివేల మొక్కలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఉపాధి హామీ పనిలో పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం 300 పడేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.  ప్రతిరోజు ఉపాధి హామీ పనుల వద్ద పర్యవేక్షణ తప్పనిసరిగా చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మన వెంట ఎంపీడీవో పర్బన్న ఏపీవో సాయిలు ఉన్నారు.
Spread the love