నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన మేడారం జాతరలో విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆలయ పూజారుల సంఘం చర్యలకు దిగింది. మేడారంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయిస్తూ దుకాణాల యజమానులకు సూచించింది. భూమిలో సులభంగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్ సంచులను వాడాలని తెలిపింది. వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.