పీఎల్‌ఐ సబ్సిడీలను విడుదల చేయాలి

– కేంద్రానికి పలు కంపెనీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ : మేక్‌ ఇన్‌ ఇండియాను ప్రోత్సహించడానికి పలు తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన మోడీ సర్కార్‌.. హామీలకు తగినట్లుగా చెల్లింపులు చేయడంలో విఫలం అవుతోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద తమకు రావాల్సిన, పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయాలని ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రభుత్వాన్ని కోరిన వాటిలో ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు మొత్తం రూ.700 కోట్ల సబ్సిడీలను చెల్లించాల్సి ఉంది. ఫాక్స్‌కాన్‌కు రూ.600 కోట్లు, డిక్సన్‌కు రూ.100 కోట్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరినప్పటికీ.. ప్రోత్సహకాలు చెల్లించడం లేదని తెలుస్తోంది.

Spread the love