నవతెలంగాణ – వీణవంక
వీణవంక మండలంలోని మల్ారెడ్డిపల్లి నుండి చల్లూర్ పంచాయతీరాజ్ రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కరీంనగర్‌నుంచి జమ్మికుంట ఆర్టీసీ బస్సు రెండు నెలల నుండి రాకపోకలు లేనందున మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు వెళ్లే విద్యార్థులకు నడక దారిన ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది. మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి మీదుగా జమ్మికుంటకు ఆర్టీసీ స్సు 15సంవత్సరాల నుండి నడుస్తుంది. చల్లూరు, మల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్యలో రెండు గ్రానైట్ క్వారీలు, ఇసుక రీచ్లు నడవడం వలన రోడ్డు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రానైట్ క్వారీల వారితో రోడ్డు వేయించి భారీ వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ దూలం సమ్మయ్యగౌడ్ డిఈ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్మంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నిమ్మల సమ్మయ్య, మడ్డి అజరు, గంధం శ్రీనివాస్, రాపర్తి సంపత్ పాల్గొన్నారు.