రైతుల ఖాతాల్లోకి డబ్బు.. పీఎం కిసాన్ విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్ : కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి వేదికగా ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి నిధులు విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో రూ.2వేలు క్రెడిట్ అవుతాయి.

Spread the love