అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. వైట్‌ హౌస్‌లో ప్రధానికి బైడెన్‌ దంపతులు ఘనస్వాగతం పలికారు. పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోడీకి బైడెన్‌ బహూకరించారు. అనంతరం ఇరువురూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానికి బైడెన్‌ దంపతులు నేడు విందు ఇవ్వనున్నారు. రేపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ దంపతులు ఏర్పాటు చేసే విందుకు మోడీ హాజరుకానున్నారు. నేడు అమెరికా కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం నోబెల్ విజేత, ఆర్థికవేత్త పాల్‌ రోమన్‌తో భేటీ కానున్నారు.

Spread the love