తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి : రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ :  తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై మరోసారి దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా దీనిపై స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు అవమానకరమని దుయ్యబ్టటారు. ‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే’’ అని రాహుల్‌ తెలుగులో ట్వీట్ చేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ #PMshouldApologisetoTelangana హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.

Spread the love