మేడారం జాతరపై ప్రధాని మోడీ ట్వీట్

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే, చైతన్యవంతమైన, వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క – సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని అన్నారు. సమ్మక్క – సారలమ్మలకు ప్రణమిల్లుదామని..వారు వ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని చెప్పారు.

Spread the love