నవతెలంగాణ-హైదరాబాద్ : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్రను కొనియాడుతూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ‘ఎక్స్’లో పోస్టులు పెడుతున్నారు. ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా తనదైన ముద్ర వేశారన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ప్రధాని మోడీ.