పిఎన్‌బి ఎగుమతి, దిగుమతిదారుల మీట్‌

హైదరాబాద్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో ఎగుమతి, దిగుమతిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ సమావేశానికి పిఎన్‌బి హెడ్‌ ఆఫీస్‌ ఐబిడి జిఎం స్వరాజ్య లక్ష్మీ, జోనల్‌ హెడ్‌ దీపక్‌ కుమార్‌ శ్రీవాస్తవా, హైదరాబాద్‌ సర్కిల్‌ హెడ్‌ ఎన్‌విఎస్‌ ప్రసాద్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ సర్కిల్‌ హెడ్‌ బివి నరేష్‌ తదితరులు హాజరయ్యారని పేర్కొంది. ఎఫ్‌ఐఇఒ తెలంగాణ మహేష్‌ దీనికి నేతృత్వం వహించారని తెలిపింది. కాగా.. ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాల్లోని 60 మంది ధనవంతులు ఈ సమావేశానికి హాజరయ్యారని వెల్లడించింది. ఈ రంగంలోని విస్తృత అవకాశాలు, బ్యాంకింగ్‌ మద్దతుపై సమగ్రంగా వివరించారని పేర్కొంది.

Spread the love