పిఎన్‌బి ఫలితాలు అదుర్స్‌

– ఐదు రెట్లయిన లాభాలు
ముంబయి : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా 474 శాతం వృద్థితో రూ.1,158.61 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.201.57 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.21,095 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. క్రితం త్రైమాసికంలో రూ.27,269 కోట్లకు చేరింది. 2022 మార్చి నాటికి 11.78 శాతంగా ఉన్న బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు.. ప్రస్తుత ఏడాది మార్చి ముగింపు నాటికి 8.74 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 4.8 శాతం నుంచి 2.72 శాతానికి పరిమితమయ్యాయి.

Spread the love