నవతెలంగాణ-గోవిందరావుపేట : మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు మేడారం మహా జాతర దృష్ట్యా సుదూర ప్రాంతాల యాత్రికుల బస కోసం ఏర్పాటుచేసి మండలంలోని చల్వాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన కిచెన్ కం డైనింగ్ హాల్ను ఐటిడిఏ పిఓ అంకిత్ మంగళవారం పరిశీలించారు.కిచెన్ షెడ్ నిర్మాణాన్ని పరిశీలించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ శ్రీమతి. ఎ. హేమలత ఈ కిచెన్ షెడ్‌లను నెల వ్యవధిలో రెండు చోట్ల పూర్తి చేయాలని ఆదేశించారు.నీటి సరఫరా ఏర్పాట్లు మరియు నీటి వనరులపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో ఆరా తీయగా, నీటి సరఫరా కనెక్షన్ కోసం బోర్ వెల్ అందుబాటులో ఉందని, రెండు సైట్‌లకు కూడా మిషన్ భగీరథ నీటి కనెక్షన్ తీసుకోవాలని ఈ ఈ టి డబ్ల్యూ ను ఆదేశించారు.ఈ కిచెన్-కమ్-డైనింగ్ హాల్స్‌కు మంజూరైన అదనపు పనులను అంటే సిసి రోడ్లు, కాంపౌండ్ వాల్స్ మరియు రెండు ప్రదేశాలలో మిషన్ భగీరథ నీటి నిల్వ కోసం సంపులను ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. మొదటి అంతస్తులోని స్లాబ్‌ను మరింత పరిశీలించి, చేసిన పనుల నాణ్యతను పరిశీలించి, భవిష్యత్తులో నీటి లీకేజీలను నివారించడానికి సరైన ప్లాస్టరింగ్‌ను ఉండేలా చూడాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సరిహద్దులను పరిశీలించారు.