మొలంగూర్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్  గ్రామంలో పోచమ్మ బోనాలను ఆదివారం గ్రామ మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లంగా ఉండాలని గ్రామ పోచమ్మ తల్లికి బోనాలను  మహిళలు ఒక్కపొద్దు లుండి భక్తిశ్రద్ధలతో బోనమెత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య జామడికే వాయిద్యాల తో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు పిల్లలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love