నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. జేఎన్ టీయూ హాస్టల్ చట్నీలో ఎలుక పడిన ఘటనపై ఆయన స్పందించారు. ‘మొన్న భువనగిరిలో కలుషిత ఆహారం.. నిన్న కోమటిపల్లిలో ఉప్మాలో బల్లి.. ఇప్పుడు చట్నీలో ఎలుక. ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటే పెద్ద మార్పే తెచ్చారు. ఇకనైనా సర్కారు కళ్లు తెరవాలి’ అని ట్వీట్ చేశారు.