బైసాకి వేడుకల్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్ 

Police Commissioner participates in Baisakhi celebrationsనవతెలంగాణ – కంఠేశ్వర్ 
సిక్కుల ప్రత్యేక బైసాకి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక పాముల బస్తి లోగల ఫతేగర్ గురుద్వారా సాహెబ్ నందు గురుద్వారా కమిటీ సభ్యులు ఘనంగా కీర్తనలు తదితర కార్యక్రమాలు ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ప్రత్యేకంగా వారి పేరుతో తయారు చేయించిన సిక్కుల పవిత్ర తల్వార్ను ప్రతినిధి దర్శన్ సింగ్ సోకి, కమిటీ సభ్యులు కలిసి అందజేశారు.
Spread the love