నవతెలంగాణ – హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం ప్రకటించింది. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను గురువారం విడుదల చేయనున్నట్లు నియామక బోర్డు పేర్కొంది. రాష్ట్రంలో ఖాళీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ స్వీకరించి.. విడతల వారీగా పరీక్షలు నిర్వహించింది.