నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ.11.06 కోట్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు చెక్కు ఇచ్చారు.