గుడుంబా స్థావరాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి, దుబ్బపేట గ్రామాల్లో విస్తృతంగా గుడుంబా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారం మేరకు శుక్రవారం కొయ్యుర్ పోలీస్,కాటారం ఎక్షైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీకి వినియోగిస్తున్న పరికరాలను, తయారీ దారులను అదుపులోకి తీసుకొని నాటుసారాయి పానకం ధ్వంసం చేసినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తెలిపారు. ఈ సంద ఎస్ఐ మాట్లాడారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, చట్టవ్యతిరేకమైన గుడుంబా, గుట్కా అక్రమంగా అమ్మకాలు జరిపిన, తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love