35 గ్రాముల బంగారం బాధితునికి అప్పగించిన పోలీసులు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణంలో జక్కుల లింగస్వామి తండ్రి దుర్గయ్య వయస్సు 25 సం లు గ్రామం జక్కులవారిగూడెం, మండలం మునుగోడు, నల్లగొండ జిల్లాకు చెందిన బంగారు గొలుసులు చెవి పోగులు పూసలు 35 గ్రాముల బంగారాన్ని చౌటుప్పల్ పోలీసులు గురువారం అందజేశారు. తేది 8 బుధవారం సాయంత్రం 7:00 గంటల రాత్రి నారాయణపురం రోడ్డులో కారు నుండి వాటర్ బాటిల్ కొనుక్కుందామని దిగుతుండగా జేబులో నుంచి బంగారం ఉన్న ప్యాకెట్ కిందపడ్డాయి. జక్కుల లింగస్వామి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎస్.దేవేందర్ క్రైమ్ టీం పిసీలు వై.కాశయ్య, పి.శ్రీను తో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి చౌటుప్పల్ పట్టణంలోని సీసీ కెమెరాలు పరిశీలించి రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతున్న గుర్తుతెలియని మహిళను పట్టుకున్నారు. ఆమెనే కనగట్ల కలమ్మ  భర్త నర్సిరెడ్డి, ఎల్లంబాయి గ్రామం, చౌటుప్పల్ మండలంగా గుర్తించారు.కనగట్ల కళమ్మ స్వచ్ఛందంగా దొరికిన బంగారాన్ని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించింది.బంగారాన్ని ఫిర్యాదుదారుడైన జక్కుల లింగస్వామికి చౌటుప్పల్ డివిజన్ ఏసిపి మొగలయ్య చేతుల మీదుగా అందజేశారు. బంగారాన్ని అప్పజెప్పిన కనగట్ల కలమ్మను ఏసిపి వై.మొగలయ్య, సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎస్.దేవేందర్ క్రైమ్ టీం పిసీలు వై.కాశయ్య, పి.శ్రీనులు అభినందించారు.

Spread the love