నవతెలంగాణ – హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 200 మంది సిబ్బందితో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. ఆయన ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పోలీసుల మోహరింపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు.