గాంధారి మండలంలోని చద్మల్ తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి సందర్భంగా జరిగే లక్ష్మమ్మ జాతర అయిపోయిన తర్వాత, అట్టి ప్రదేశంలో దొంగ/ ఫేక్ కరెన్సీ నోట్లు వచ్చాయని, గ్రామస్తుల ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు గాంధారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయనైనది. కేసు దర్యాప్తులో భాగంగా చద్మల్ తండ నందు ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా లక్ష్మమ్మ జాతర జరగబడుతుంది. జాతర అయిపోయిన తర్వాత గుడి నందు మిగిలిన డబ్బులను అవసరం ఉన్నవారికి వడ్డీ రూపంలో ఇచ్చిన సందర్భంలో లక్ష్మమ్మ గుడి నందు క్యాషియర్ గా పని చేసే మాండ్ గోపాల్ s/o సరిచంద్, నివాసం చద్మల్ తండా అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మాలి రవీందర్ s/o జాలం సింగ్ తో కలిసి గుడి డబ్బులు వేరే వాళ్ళకి మిత్తికి ఇచ్చే సందర్భంలో కొన్ని 500/- రూపాయల కట్టనందు కొన్ని 500/- రూపాయల నకిలీ నోట్లను కలిపి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో కొన్ని దొంగ నోట్లను సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు ఫిర్యాదు దారుల దగ్గర నుండి కొన్ని దొంగ నోట్లను స్వదీన పర్చుకొని ఆ తర్వాత మాండు గోపాల్ మరియు మాలి రవీందర్ లను విచారించగా, వాళ్లు దొంగ నోట్లు తీసుకువచ్చారని, దొంగ నోట్లు కలపగా వచ్చిన డబ్బులను చెరిసగం పంచుకుందామని ఒప్పుకొని, అట్టి దొంగ నోట్లను డప్పు తండాకు చెందిన బడవత్ సంగ్రామ్ s/o పాసు నాయక్ అనే వ్యక్తి వాళ్ళకి ఇచ్చి ఈ నకిలీ డబ్బులను చలామణి చేయగా వచ్చిన డబ్బులను తనకి సగం ఇవ్వాలని తెలిపినడాని, బడవత్ సంగ్రామ్ s/o పాసు నాయక్ కూడా అదుపులోకి తీసుకొని విచారించగా సంగ్రామ్ కు గత కొన్ని నెలల క్రితం, నిజామాబాద్ చెందిన తిరుపతి అలియాస్ రాజు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని అతనితో ఫోన్లో మాట్లాడగా నా వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని నమ్మించినాడు, అవి చాలా మందికి చలామణి చేస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు.
బాగా లాభాలు కూడా వస్తాయని అతను చెప్పడంతో ఇట్టి విషయాన్ని పోచారం తండకి చెందిన మూడు రవీందర్ కు మరియు అలాగే కొనాపూర్ సోమ్లానాయక తండా కి చెందిన ధరవత్ చందర్ కూడా తెలుపగా వాళ్లు కూడా సరే అని ఒప్పుకోవడంతో సంగ్రామ్, రవి, చందర్ ముగ్గురు కలిసి నిజాంబాద్ కు వెళ్లగా అక్కడ మరొక ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి వారిని పరిచయం చేసుకోగా వారి పేర్లు తిరుపతి@రాజు,మగ్గిడి కిషన్ @ వెంకట్, రామ్ టెంకి భాను ప్రసాద్ లో నిజాంబాద్ లో కలసి మాట్లాడుతూ ఒక అసలు నోట్ ఇస్తే దానికి బదులు నాలుగు నకిలీ నోట్లు ఇస్తానని బేరం కుదుర్చుకొని, సరే అన్న తర్వాత సంగ్రామ్ రవి చందర్ తెచ్చిన లక్ష ఇరవై వేల రూపాయలు వాళ్లకి ఇవ్వగా, వాళ్లు ఐదు లక్షల ఇచ్చినామని తెలుపగా, సరే అని ఒప్పుకొని వారి వద్ద నుండి 5,00,000/- నకిలీ నోట్లు ఉన్న బ్యాగ్ తీసుకొని వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకోగా అవి దాదాపు రెండు లక్షల నకిలి నోట్లు మాత్రమే ఉన్నాయి. మేము మోసపోయమ్ అని గ్రహించి ఇవన్నీ ఎలా అయినా చలామణి చేయాలని ఉద్దేశంతో సంగ్రాo అనే వ్యక్తి మాలి రవితో ఉన్న స్నేహబంధం ద్వారా మాలి రవితో ఒప్పందం చేసుకొని, సంగ్రామ్ దగ్గర నుంచి మాలి రవి మూడు కట్టలు అనగా దాదాపు లక్ష రూపాయలు తీసుకొని, దాని నుండి ఒక 20 వేల రూపాయల నోట్లను క్యాషర్ గా ఉన్న మాండు గోపాల్ కు ఇవ్వగా, ప్రజలకు మిత్తికి ఇచ్చే సందర్భంలో ఒక 500 రూపాయల కట్టలో ఒకటి లేదా రెండు నోట్లు నకిలీ 500/- రూపాయల నోట్లను కలుపుతూ పంపిణీ చేయడం జరిగింది.
అయితే ఇట్టి నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు అనే వ్యక్తి అలాగే విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా అందినట్లు విచారణ లో తేలింది. నేరంలో భాగస్తులైన 1. మాండు గోపాల్, 2. మాలి రవీందర్ 3. బడావత్ సంగ్రామ్ 4. మూడు రవీందర్ 5. ధరావత చందర్ 6. మగిడి కిషన్ 7. రామ్ టింకి భాను ప్రసాద్ లను ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నాము. విచారణలో భాగంగా నేరస్థుల వద్దనుంది 9 మొబైల్ ఫోన్లను, ఒక బైకును మరియు 1,45,500/- విలువగల 500 రూపాయల 291 నకిలీ నోట్లను, 31400/- రూపాయల విలువ గల 200 రూపాయల 157 నకిలీ నోట్లు స్వాధీన పరచుకోనైనది. మిగతా నోట్లో ను నేరస్తులు కాల్చివేయడం జరిగినది. నేర విచారణలో చాకచకక్యం ప్రదర్శించి నేరస్తులను పట్టుకున్న సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, టెక్నికల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, ఐడి పార్టీ కానిస్టేబుల్ రవికుమార్, సాయిబాబా, గాంధారి హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డిని, మరియు సిబ్బంది బంతిలాల్, సుబాష్ మిగతా సిబ్బంది అందర్నీ జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించినారని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు అన్నారు