– పోలీసుల అదుపులో పలువురు నింధితులు
నవతెలంగాణ కోనరావుపేట: మండలం ధర్మారంలో జరిగిన నాటుబాంబు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంబించారు. ధర్మారంలో మల్లేశం అనే రైతుకు చెందిన గేదె నాటుబాంబు పేలి గాయపడిన విషయం విధితమే. ఈ విషయమై చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ధర్మారం గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ జరిపారు. ధర్మారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పలువురికి నాటు బాంబులు విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం రాజన్నగొల్లపల్లి, బోనాలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బోనాలకు చెందిన వ్యక్తి దగ్గర నాటుబాంబులు లభ్యమైనట్టు సమాచారం.