సిసి ఫుటేజీ, సెల్ ఫోన్ సీఈఐఆర్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు

– పోలీసులకు రివార్డులు ఇచ్చిన ఎస్పీ
– ప్రతి దుకాణాల ముందు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
– జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏప్రిల్ నెలలో జరిగిన దొంగతనం కేసులో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని కేసీఆర్ కాలనీకి చెందిన అలకొండ సంతోష్ రెడ్డి తన ఇంట్లో ఏప్రిల్ నెల 28న తాము రాత్రి పడుకొని ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువాలోగల బంగారు నగలు రెండు సెల్ ఫోన్లు, నగదు లక్ష రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ దర్యాప్తులో తన సూచనలు, జిల్లా అడిషనల్ ఎస్పీ సూచనలతో కామారెడ్డి డిఎస్పి సురేష్ పర్యవేక్షణలో కామారెడ్డి పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ సిఐ,ఎస్ఐ, సిబ్బంది బృందాలుగా ఏర్పడి సీసీటీవీ పుటేజి, సీఈఐఆర్ చెక్ చేయగా నలుగురు వ్యక్తులు ఇట్టి నేరం చేసినట్లుగా గుర్తించి, సీసీటీవీ ఫుటేజ్ లను చూస్తూ మేడ్చల్, మేడ్చల్ నుండి దమ్మాయిగూడా నుండి సెమీర్పేటలకు వెళ్లినట్లు గుర్తించారనీ, ఎత్తుకెళ్లిన మొబైల్స్ సీఈఐఆర్ ఆధారంగా సీసీటీవీ, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిని విచారించగా తాము ఆ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు అన్నరు .ఏ వన్ నిందితుడు మహమ్మద్ ఫిరోజ్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, మేడ్చల్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తి, ఏ టు బొమ్మని రాములమ్మ అశోక్ అలియాస్ అనిల్ మేడ్చల్ జిల్లా, మజీద్ కాలనీ, దమ్మాయిగూడ కు చెందిన వ్యక్తి, ఏ 3, సదల భరత్ కుమార్, రంగారెడ్డి జిల్లా, ఆర్ జె కె కాలనీ, బండ్లగూడ నివాసి, ఏ ఫోర్ తేనుగు మహేందర్, మేడ్చల్ జిల్లా, దమ్మైగూడ, నాగిరెడ్డిపేట్ గ్రామానికి చెందిన ఈ నలుగురు యువకులు కలిసి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. వీరి వద్ద నుండి రెండు తులాల బంగారం నల్లపూసల దండ, తులం,5 గ్రాముల బంగారం నెక్లెస్, ఒకతులం బంగారు చైన్, ఐదు గ్రాముల పిల్లల బంగారు చైన్, రెండు గ్రాముల బంగారు ఉంగరం, రెండు జతల బంగారు కమ్మలు, వీటితోపాటు ఒక గ్రామం మాటీలు మొత్తం ఆరు తులాల నాలుగు గ్రాముల బంగారం కాగా నగదు లక్ష రూపాయలు మొత్తం స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ ఐదు లక్షల వరకు ఉంటుందని వీటితోపాటు నాలుగు సెల్ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఏ వన్ ముద్దాయి అయినటువంటి మహమ్మద్ ఫిరోజ్ ఇంతకుముందు హైదరాబాద్, విజయవాడలో పలు కేసులలో నిందితుడుగా ఉన్నాడని వాటిని పరిశీలించి అతనిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు.
కామారెడ్డి జిల్లాలో సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోలర్ కు అన్నసంతానం చేయడం జరిగిందని నేరస్తులు ఎవరైనా ఎంతటి వారైనా కామరెడ్డి జిల్లాలో ఎక్కడైనా ఎటువంటి నేరాలకు పాల్పడిన సీసీటీవీ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పట్టుకొని చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు తమ తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ఈ కేసును సేదించడంలో కామారెడ్డి డి.ఎస్.పి, పట్టణ ఇన్స్పెక్టర్ నరేష్, సి సి ఎస్ సి ఐ మల్లేష్ గౌడ్, టౌన్ ఎస్ఐ రాజు, సాయి రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్, ఏఎస్ఐ రాజేశ్వరరావు, సిసిఎస్ సిబ్బంది హెచ్ సి ఎస్ సైద్, కిషన్, సురేందర్, పి సి ఎస్ గణపతి, మైసయ్య, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, రాజేందర్ లను అభినందిస్తూ రివార్డులను అందజేశారు. వీరితోపాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది రోహిత్ , ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Spread the love