నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్కు చెందిన మొయినాబాద్ ఫామ్హహౌస్లో కోడి పందేలు కలకలం రేపాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ నిర్వహణపై ఆయనను విచారించనున్నారు. మంగళవారం రోజు పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కిన విషయం తెలిసిందే. వారి వద్ద రూ.30 లక్షల నగదు, జూదక్రీడలో ఉపయోగించే రూ.కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు దొరికాయి. పోలీసులు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులిచ్చి వదిలేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని కొందరు పరారయ్యారు.