మెడికో ప్రీతి హాస్టల్ గదిని తెరిచిన పోలీసులు

నవతెలంగాణ – హైదరాబాద్:  సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి… హాస్టల్ గదిని వరంగల్ పోలీసులు బుధవారం తెరిచారు. కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 409లో ప్రీతి ఉండేది. ఈ గది నాలుగు నెలలుగా మూసి ఉంది. ఈ గదిని కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో తెరిచారు. హాస్టల్ గదిని తెరిచాక అక్కడి ప్రీతి ఉపయోగించిన వస్తువులను చూసి తల్లిదండ్రులు విలపించారు. ప్రీతి లగేజీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Spread the love