నవతెలంగాణ-నిజామాబాద్ : రుద్రూర్ మండలంలో పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. అర్థరాత్రి రుద్రూర్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న తన స్నేహితుడిని రిసీవ్ చేసుకునేందుకు సాయి కుమార్ అనే వ్యక్తి బస్టాండ్‌కు వచ్చాడు. అయితే అతనిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. రుద్రూర్ ఏఎస్ఐ రాజు, కానిస్టేబుల్స్ చిన్నయ్య, రాజు, హోమ్ గార్డు కరీంలు దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే ఫిర్యాదు చేయవద్దని సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్‌కు సాయి కుమార్ ఫిర్యాదు చేశాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.