గుడుంబా స్థావరాలు పై పోలీసుల దాడులు

– అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు
– డిఎస్పి వెంకటేశ్వర బాబు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
గుడుంబా స్థావరాలపై స్థానిక పోలీసులు దాడులు చేసి గుడుంబా తయారీకి చేసే బెల్లం పానకం ధ్వంసం చేశారు వివరాల్లోకి వెళితే మండలంలోని సోమారపుకుంట తండా, తులసి తండా లలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ జి పాటిల్ ఆదేశాల మేరకు తొర్రూర్ డిఎస్పి వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ మరియు ఎస్సై జగదీష్ అరుణ రాంజీ నాయక్ ఆధ్వర్యంలో తండాలలో దాడులు చేయడం జరిగింది, అందులో భాగంగా 2000 లీటర్లు బెల్లం పానకం ను ధ్యంసం చేసినారు మరియు 04 వ్యక్తులు నుండి 30 లీటర్లు గుడుంబా సీజ్ చెసి అట్టి వ్యక్తులు పై కేసులు నమోదు చేసినారు, ఈ సందర్బంగా CI సత్యనారాయణ మాట్లాడుతు గుడుంబా తయారీలో పాల్గొన్న వారందరిని బిండోవర్ చేయడం జరుగుతుంది అని, గుడుంబా పెట్టుచున్న వ్యక్తులను గుర్తించి వారికీ ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సకాలు రాకుండా జిల్లా కలెక్టర్ కి ను వీరి పేర్లతో లిస్టు తయారుచేసి పంపుతమనీ హెచ్చరించారు, అదేవిధంగా ఎవరైనా రిపీటెడ్ గా గుడుంబా కేసు లలో ఉంటే వారిపై పిడి యాక్ట్ కేసులు పెడుతామణి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love