నవతెలంగాణ – హైదరాబాద్ : లైంగికదాడి ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. గోవాలో అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో ఆయన్ను హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 2020లో లైంగిక దాడి చేశారని బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమె అప్పటికి మైనర్ కావడంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.