నవతెలంగాణ- భీంగల్
సీఈఐఆర్ సాంకేతికత ద్వారా భీంగల్ పోలీసులు పోయిన ఫోన్ ను పట్టుకొని బాధితునికి అందజేశారు. పట్టణ కేంద్రానికి చెందిన కిరాణా అనే వ్యక్తి తన ఐక్యూ మొబైల్ ఫోన్ పోయిందనే ఫిర్యాదుతో సి ఈ ఐ ఆర్ ద్వారా నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకొని గురువారం ఎస్సై హరిబాబు బాధితునికి అందజేశారు. ఇందుకు కృషి చేసిన కానిస్టేబుల్ సుధీర్, రాజ్ కుమార్ లను ఎస్సై అభినందించారు.