48 గంటల్లో బాపట్ల లైంగికదాడి కేసును ఛేదించిన పోలీసులు

నవతెలంగాణ – హైదరాబాద్: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కన ఓ యువతి మృతదేహం పడి ఉండడం నిన్న కలకలం రేపింది. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసి ఉంటారని భావించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. కాగా, ఈ కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ స్పందించారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. నిందితులు ముగ్గురూ ఈపూరుపాలెంకు చెందినవారేనని తెలిపారు. మద్యం మత్తులో ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడినట్టు చెప్పారని ఎస్పీ వివరించారు.

Spread the love