2 గంట‌ల్లోనే రెండు కిడ్నాప్ కేసుల‌ను ఛేదించిన పోలీసులు

నవతెలంగాణ – హైద‌రాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం ఇద్ద‌రు చిన్నారుల‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. ఈ రెండు కిడ్నాప్ కేసుల‌ను రెండు గంట‌ల్లోనే హైద‌రాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. మ‌హంకాళి, సుల్తాన్ బ‌జార్ పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఆటోలో అప‌హ‌రించారు. బాధిత చిన్నారుల త‌ల్లిదండ్రులు ఆయా పోలీసు స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆటో డ్రైవ‌ర్ ఇమ్రాన్, ప్ర‌వీణ అనే మ‌హిళ‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్ద‌రు పిల్ల‌ల‌ను అప‌హ‌రించి, అమ్మేస్తున్న‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తు తేలింది. ఇద్ద‌రు చిన్నారుల‌ను వారి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌జెప్పారు.

Spread the love