– 12 మంది వాంగ్మూలాలు రికార్డ్ ఆందోళనకు అడ్డంకిగా మారితే ఉద్యోగాలను వదిలేస్తాం..
– అమిత్ షా భేటీ ఎవరికి చెప్పొద్దని, మళ్లీ ప్రభుత్వమే మీడియాకు లీక్ చేసింది
– పోరాటం కొనసాగుతుంది …రెజ్లర్ భజరంగ్ పునియా
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రెజ్లర్లలో ఒకరైన రెజ్లర్ బజరంగ్ పునియా కేంద్ర హౌం మంత్రి అమిత్ షాతో రెజ్లర్లకు ఎలాంటి ‘హామీ’ లేదని, నిరసనలు కొనసాగుతాయని అన్నారు. షాతో తమ సమావేశం గురించి ఎవరికీ వెల్లడించవద్దని ప్రభుత్వం తనకు, తోటి రెజ్లర్లకు చెప్పిందని, అయితే వారే దానిని మీడియాకు లీక్ చేశారని పునియా అన్నారు. విచారణ జరుగుతోందని హౌంమంత్రి తమకు చెప్పారని పునియా అన్నారు. నిరసన తగ్గలేదని, కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పునియా మాట్లాడుతూ అథ్లెట్లు తమ డిమాండ్లను అంగీకరించడం లేదని, ప్రభుత్వం ప్రతిస్పందనతో సంతప్తి చెందలేదని అన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని, రక్షణ కవచం పెట్టారని షాను ఆయన అడిగారు. రెజ్లర్లు వెనక్కి తగ్గరని నొక్కి చెప్పారు. దీనిపై తాము (ప్రభుత్వం) చర్చిస్తు న్నామని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని హౌంమంత్రి హామీ ఇచ్చినట్లు పునియా తెలిపారు. ప్రభుత్వ హామీలపై జనవరిలో రెజ్లర్లు ఎలా వెనక్కి వెళ్లిపోయారని, ‘అబద్ధాలు గా ప్రకటించబడ్డారని’ పునియా గుర్తు చేసుకున్నారు. ఆందోళనలో అడ్డంకిగా మారితే ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకునేందుకు కూడా రెజ్లర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఇంటికి మంగళవారం ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని ఆయన ఇంటికి వెళ్లారని సమాచారం. దానిలో భాగంగా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి 12 మంది వాంగ్మూలం రికార్డు చేశారు. అంతేగాకుండా బ్రిజ్ భూషణ్ మద్దతుదారులను కొందరిని ప్రశ్నించారు. ఇందులో భాగంగా ఎంపీని ప్రశ్నించారో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకూ 137 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్టు సంబంధిత వర్గాల వెల్లడించాయి. వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లను, అడ్రస్, ఐడీ కార్డులను తీసుకున్నారు. సాక్ష్యం కోసమే ఆ డేటాను సేకరించినట్టు పోలీసులు వెల్లడించారు.
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు నలుగురు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. శరణ్ సింగ్ ఢిల్లీ నివాసంలోని కొంతమంది సిబ్బందిని కూడా పోలీసులు విచారణ కోసం పిలిచారని వారు తెలిపారు.
మరోవైపు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యల విషయంలో ప్రభుత్వ నిష్క్రియా పర త్వానికి నిరసనగా జూన్ 9న జంతర్ మంతర ్‌కు వెళ్లే తమ ప్రణాళికను వాయిదా వేసినట్టు భారతీయ కిసాన్ యూనియన్ తెలిపింది. ”ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. వారు (మల్లయోధులు) హౌంమంత్రిని కలి శారు. వారి అభ్యర్థన మేరకు మేం జూన్ 9 నిర సన ప్రదర్శనను రద్దు చేశాము. భవిష్యత్తులో వారు నిర్ణయించే తేదీలో మేం వారికి మద్దతు ఇస్తాం” అని రాకేశ్ తికాయత్ అన్నారు.
మైనర్ ఫిర్యాదు ఉపసంహరించుకుందనే వార్తాల్లో నిజం లేదు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మైనర్ మహిళా రెజ్లర్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారనే వార్తలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ కావ డంతో, వారు ఫిర్యాదును ఉపసంహరించు కోలేదని ఆమె తండ్రి స్పష్టం చేశారు. ”ఆ వార్త పూర్తిగా ఫేక్. నేను ఫిర్యాదును ఉపసంహరిం చుకోలేదు. నేను పోరాడాలని నిర్ణయం తీసు కున్నాను”అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ, న్యాయం కోసం ఈ ప్రయాణం చాలా కఠినమై నదని రుజువు చేస్తోందని, తమకు ప్రశ్నించే రోజులు ఉన్నాయని ఆయన అన్నారు. ”అవును, నాకు పోరాడే స్ఫూర్తి ఉంది. నేను దానితో పోరాడుతున్నాను. కానీ నేను ఎప్పటి వరకు కొనసాగించగలను?” అని అన్నారు.
ఆమె బోరున ఏడ్చింది: సాక్షి వాంగ్మూలం
ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ లను ఒక సాక్షి 2010 కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత అనిత ధ్రువీకరించింది. తనతో ఫిర్యాదు రెజ్లర్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల గురించి చెప్పుకొని బోరున ఏడ్చిం దని తెలిపింది. తనకు విదేశాలలో ఒక టోర్న మెంట్ నుంచి ఫోన్ చేసి సింగ్ తనను తన గదికి పిలిచి, ”బలవంతంగా” కౌగిలించుకున్న సంఘటనను ఫిర్యాదుదారు నాతో ”షేర్” చేసు కొందని రెజ్లర్ అనిత (38) తెలిపింది. పోలీసు విచారణలో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 125 మంది సాక్షులలో అనిత కూడా ఉన్నారు.
జాతీయ స్థాయి శిబిరాల్లో ఫిర్యాదుదారుకి రూమ్‌మేట్‌గా ఉన్న అనిత ఇలా అన్నారు: ”ఆమె (రెజ్లర్) స్వర్ణం సాధించిన ఛాంపియన్ షిప్ తర్వాత, ఆమె ఇంటికి వెళ్లలేదు. కానీ నేరుగా పాటియాలాలోని శిబిరానికి వచ్చింది. పోటీ జరిగిన నగరం (విదేశీ) నుండి ఆమె నాకు ఫోన్ చేసి ‘దీదీ బహుత్ ఐసీ బాత్ హౌ గయీ, మే ఆకే బతౌంగీ ఆప్కో కుచ్’ అని చెప్పి ంది. బహుత్ బురా కామ్ హై యహాన్ తో’ (సోదరి, ఒక సంఘటన జరిగింది. నేను తిరిగి వచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ చాలా తప్పు జరుగుతోంది)” అని పేర్కొందని తెలిపింది. పాటియాలా చేరుకున్న తరువాత రెజ్లర్ అనితకు తన కష్టాలను వివరించింది. ”ఆమె తన పోటీ తర్వాత తన గదికి వెళ్లిందని నాకు చెప్పింది. అప్పుడు చీఫ్ బ్రిజ్ భూషణ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని ఫిజియో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అంతకుముందు కూడా అతను ఆమెను ఫోన్‌లో ఇబ్బంది పెట్టేవాడు. నేను నీకు ప్రొటీన్ (సప్లిమెంట్స్) ఇస్తాను అని చెప్పి వేధించేవాడు. ఆమె భయపడింది. అప్పటికే ఆమె అసౌకర్యంగా ఉంది. ఆమె నాకు చెప్పినది ఏమిటంటే, ఆమె గదికి చేరుకున్నప్పుడు, ఆమె దూరంగా కూర్చుంది. కానీ ఆయన ‘అరే అరే ఐసా క్యు కర్ రహీ హౌ, తుమ్ హమారీ బిటియా హౌ, హమారే పాస్ ఆవో’ అన్నాడు. (నువ్వు నా కూతురిలా ఉన్నావు. దగ్గరికి రా అని అన్నాడు). కూతురనేసరికి ఆమె వెళ్లి ఆయన పక్కన కూర్చుంది. ఆయన ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సంఘటన తర్వాత ఆమె చాలా భయపడిపోయింది. అక్కడి నుంచి తిరిగొచ్చాక జరిగిన విషయాన్ని చెప్పి ఏడ్చింది” అని అనిత వివరించింది. ”నిరంతర లైంగిక వేధింపుల చర్యలు, అసభ్యకరమైన చేష్టలు”తో బ్రిజ్ భూషణ్ వ్యవహరించారు. ”ఇంతకు ముందు, ఆమె స్వర్ణం గెలిచిన ఛాంపియన్‌షిప్ కు ముందు, ఆయన (సింగ్) ఆమెను ఫోన్‌లో ‘హమ్ తుమ్హారే యే మదద్ కరేంగే, హమ్ సే బాత్ కరో (నేను నీకు సహాయం చేస్తాను. నాతో మాట్లాడు) అని అనడం ప్రారంభిం చాడు. ఆయన నా ఫోన్‌కి కూడా కాల్ చేసే వాడు. ఆమెతో మాట్లాడాలను కుంటున్నానన ేవాడు. మొదట, బ్రిజ్ భూషణ్ కాల్ చేసేవాడు. ఛాంపియన్ షిప్ లో జరిగిన సంఘటన తర్వాత, ఒక ఫిజియో తరచుగా కాల్ చేయడం ప్రారంభించాడు. ఫిజి యో ఆమెకు, ‘ప్రెసిడెంట్ మీ గురించి అడుగుతున్నారు. ప్రెసి డెంట్ మీ కోసం ఏమైనా చేస్తారు’ అని చెప్పేవాడు. ఆమె చాలా అ సౌకర్యంగా, కలత చెందింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ అమ్మా యిని ఎందుకు తరచుగా పిలు స్తాడు? అనిత ప్రశ్నించింది. ”ఆయన ఫోన్ కాల్స్ తీయడం మానేసింది” కాబట్టి ఫిర్యాదుదారు సింగ్‌కు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించారని అనిత తెలి పారు. తన స్నేహితురాలు తన స్వరాన్ని పెంచి నట్లయితే, అది తన కెరీర్ కు ముగింపు పలికేది” అని అనిత చెప్పారు. రిటైర్డ్ డబ్ల్యుఎ ఫ్‌ఐకి వ్యతిరేకంగా మాట్లాడినా పరిణామాలు ఉంటాయని అన్నారు. ”శిబిరాల్లో ఆహారం నాణ్యత గురించి ఫిర్యాదు చేయడానికి బాలిక లు భయపడుతున్నారు. లైంగిక వేధింపుల గురించి మాట్లాడే ధైర్యం వారికి ఎలా వస్తుంది?” అని అన్నారు.